శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లోని పోలవరం గ్రామానికి చెందిన రైతు కూలీ ధవళ రమేష్ కుమార్ మంగళవారం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి ఆయన మృతదేహాన్ని గుర్తించారు ఘటనపై పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు..