అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురం కు చెందిన నర్సింహమూర్తి అనే వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం హిందూపురం నుంచి లేపాక్షి రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.