ప్రభుత్వం నుంచి అరకొరగా యూరియా పంపిణీ చేయడం వల్ల వచ్చిన యూరియా ఎరువులు కూడా ఫర్టిలైజర్ మాఫియా కృత్రిమ కోర్త సృష్టించి చిన్న సహకార రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు అగ్రి అడ్వైజరీ బోర్డ్ మాజీ జిల్లా చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 30000 ఎకరాల్లో మొక్కజొన్న 70 వేల ఎకరాల్లో వరి పంట సాగులో ఉందన్నారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎక్కడికక్కడ రైతులకు ఎరువు యూరియా అందజేసే వారుమని తెలియజేశారు