పొలాల్లోకి దూసుకెళ్లిన కారు నాగలాపురం(M) సుబ్బానాయుడు కండిగ బస్ స్టాప్ సమీపంలోని సెల్ టవర్ పక్కన ఓ వ్యవసాయ పొలంలో కారు బోల్తా పడింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగిందని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణించిన వ్యక్తులు ఏమయ్యారన్న విషయం ఎవరికి తెలియలేదు. స్థానికులు ఈ ఘటనను చూసి నాగలాపురం పోలీసులకు సమాచారం చేరవేశారు. వాహన యజమానులు పోలీస్ స్టేషన్కు వస్తే గాని అసలు విషయం తెలియదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.