సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులకు ఆర్పీలు ఎలా బోధించాలో అవగాహన కల్పించారు. ఈనెల 11న మరో 50% మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతాయని ఎంఈవో విద్యాసాగర్ తెలిపారు.