తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో మంగళవారం “స్త్రీ శక్తి" కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి ప్రయోజనాలను అందిస్తూ మహిళలకు పెద్దపీట వేస్తోందని, చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేయడానికే ఈ వేడుక ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నాయుడుపేట ఏఎంసీ లో జరగనున్న ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట నుండి మహిళలు భారీగా తరలి వెళ్లారు. సూళ్లూరుపేట టోలేట్ వద్ద జెండా ఊపి విజయశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, టీడీపీ నాయకులు పాల్గొన్నా