కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వల్లూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన దక్షిణ కాశీ,పంచనదీ క్షేత్రం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం శ్రీరామచంద్రుడు ఒకే బాణoతో ఏడు సాల వృక్షాలను నేల కొరిగేటట్లు చేశాడని చెప్పే కుడ్య శిల్పం ఉందని రచయిత ,చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ఆదివారం అన్నారు.ఈ కుడ్య శిల్పంలో హనుమంతుడు వంగి తన రెండు చేతులు జోడించి శ్రీరామ లక్ష్మణలతో సంభాషిస్తున్నట్లుగా ఆనాటి శిల్పులు అద్భుతంగా చెక్కారని రచయిత తెలిపారు. ఏడు సాల వృక్షాలకు సజీవ సాక్ష్యంగా హనుమంతుని ఎనకాల 7 నిలువు గీతలను చిత్రీకరించారని చెప్పారు.