నారాయణపేట జిల్లాలో మహిళల రక్షణ కోసం సి టీం యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ గురువారం మూడు గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థినిలు మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడవద్దని గృహ హింసకు గురైన ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.