గంట్యాడ మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆగస్ట్ 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, ఆదివారం మధ్యాహ్నం గంట్యాడ లో పౌరసరఫరాల శాఖ ఉప తహసిల్దార్ మూర్తి తెలిపారు. గంట్యాడ మండలానికి 20,028 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయని వీటిని గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు 25 నుంచి 30వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి కార్డులు పంపిణీ చేస్తారన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు రేషన్ డిపోలలో డీలర్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.