డీఎస్సీలో పోస్టు ఎంపిక ప్రాధాన్యతను అభ్యర్థులకే కేటాయించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025లో పోస్టు ప్రాధాన్యత ఎంపికను పరీక్షలకు ముందే ఇచ్చారని,6 వేల మంది అర్హత ఉన్నప్పటికీ ఉన్నతస్థాయి పోస్టును కోల్పోవలసి వస్తుందని తెలిపారు. ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ లాంటి సంస్థలు సైతం ఫలి తాలు వచ్చిన తరువాతనే పోస్టు ప్రాధాన్యత విధానాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.