పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఏపీ 07 బీజడ్ 6067 గల హీరో హోండా గ్లామర్ ద్విచక్ర వాహనం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చోరీకి గురిందని బాధితుడు పేర్కొన్నారు. ఎడ్లపాడు మండలం ఉన్నవా గ్రామానికి చెందిన పత్తిపాటి నరేంద్ర తన కుమారుడు అస్వస్థతతో ఉండగా ప్రభుత్వాసుపత్రిలో వైద్యానికి వెళ్లే క్రమంలో తన వాహనాన్ని హాస్పిటల్లో పార్కు చేశారు. గుర్తుతెలియని దండగలు అపహరించారని బాధితుడు నరేంద్ర తెలియజేయడం జరిగింది.