అనంతపురం నగరంలోని ఎం వై ఆర్ ఫంక్షన్ హాల్ లో తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరయ్యారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు.