మచిలీపట్నంలో మార్క్ ఫెడ్ గోదాముల అభివృద్ధికి చర్యలు: ఛైర్మన్ బంగార్రాజు స్తానిక మచిలీపట్నంలోని మార్క్ ఫెడ్ గోదాములను రాష్ట్ర మార్క్ ఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు శుక్రవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో పరిశీలించారు. రూ. 6 కోట్లు వ్యయంతో కొత్త గోదాములు నిర్మించేందుకు బోర్డు నిర్ణయించిందని అయన మిడియాకు తెలిపారు. కృష్ణా జిల్లాలో PACS ద్వారా 12,627 మెట్రిక్ టన్నుల యూరియా, రైతు సేవ కేంద్రాల ద్వారా 392 టన్నులు రైతులకు సరఫరా చేశామని వెల్లడించారు. అలాగె రాష్ట్ర వ్యాప్తంగా మార్క్ ఫెడ్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.