పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి పుణ్యక్షేత్రం మరియు విజయవాడ రహదారిలో ఎగువను కురిసిన వర్షాలు కృష్ణా నది ప్రవాహం పెరగడంతో కొండవీటి వాగు వరద నీరు పెద్దమద్దూరు వంతెన పై సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమరావతి నుండి విజయవాడకు వెళ్లేవారు నరుకుల్లపాడు ఎండ్ చావు పాడు గ్రామాల మీదగా పెద్ద మద్దూరుకు చేరి ప్రయాణాన్ని కొనసాగించాల్సి వస్తుంది.