ర్యాగింగ్ ఒక సరదా కాదు అది ఒక నేరమని రాచకొండ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం వీడియో విడుదల చేశారు. కొట్టడం అవమానించడం బంధించడం ఇవన్నీ ర్యాగింగ్ కిందికి వస్తాయని ఇవన్నీ చేసిన వారు చట్టపరంగా శిక్ష అర్హులని అన్నారు. ఒకసారి ర్యాగింగ్ కేసు రిజిస్టర్ అయితే భవిష్యత్ చీకటిమయం అవుతుందని అన్నారు. ర్యాగింగ్ ఎంత ప్రమాదకరమో తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలని తెలిపారు.