అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవమైన అక్టోబర్ 1 వ తేదీ లోగా రాష్ట్రంలో వృద్ధుల, వితంతువుల, విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమానికి ప్రత్యేక కమిషన్ నియమించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం నగరంలోని కొత్త పేటలో గల మల్లయ్య లింగం భవన్ నుండి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడారు రాష్ట్రంలో 13 శాతం పైగా 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఉన్నారని, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో 15 వేల పెన్షన్ పొందుతున్న విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు సుమారు 80 లక్షలకు పైగా ఉన్నారని తెలిపారు. వారి సంక్షేమానికి ప్రత్యేక కమిషన్ ను నియమించాలని కోరారు.