ఇబ్రహీంపట్నం ఎర్దండిలో పెరిగిన గోదావరి ఉదృతి ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామం వద్ద గల గోదావరి నది ప్రవాహం అదివారం ఉదయం అమాంతంగా పెరిగింది. నది ఉద్ధృతి పెరుగుతుండడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. నీరు గ్రామానికి వెళ్లే మార్గంలోగల కల్యాణ మండపం, ఇతర ఆలయాలను ముంచెత్తి ప్రవహిస్తుంది. నది ఉద్ధృతిని చూసేందుకు పర్యాటకులు తండోపతండాలుగా రావడంతో గ్రామస్థులు నది మార్గానికి అడ్డుగా ట్రాక్టర్ నిలిపి నివారిస్తున్నారు.