భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాల సాయిబాబా నగర్ సర్కిల్లో ప్రజాసంఘాల నాయకులు శనివారం నిరసన తెలిపారు. భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఇప్పటికైనా ట్రంప్ నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.