ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తన కుటుంబంతో కలిసి శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ ఆలయ అర్చకులు ఈవో మంత్రికి ఘన స్వాగతం పలికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం సంతోషకరమని రథసప్తమి రాష్ట్ర పండుగగా చేయడంలో ఎమ్మెల్యే గుండు శంకర కృషి అభినందనీయమని తెలిపారు...