భీమిలి ఎం.పి.డి.ఓ. కార్యాలయంలోని ఖాళీ స్థలంలో ప్రజలందరికీ ఉపయోగపడే నిర్మాణాన్ని చేపడతామని, అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎం.పి.డి.ఓ. కార్యాలయం ఆవరణను మంగళవారం ఆయన సందర్శించారు. ప్రజోపయోగార్ధం స్థలాన్ని ఏ విధంగా వాడితే మంచిదని ప్రాథమికంగా అడిగి తెలుసుకున్నారు. ఎం.పి.డి.ఓ. కార్యాలయ ప్రాంగణం మొత్తం 3.75 ఎకరాలు కాగా ఎకరంన్నర స్థలంలో కార్యాలయ భవనం, సమావేశ మందిరం, బుద్ధ విగ్రహం తదితరాలు నిర్మించారు. గతంలో ఎం.పి.డి.ఓ. కార్యాలయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించినప్పుడు తెలిపారు.