సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం జహీరాబాద్ వైపు నుండి ముంబై వైపు జాతీయ రహదారిపై వెళ్తున్న కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన విషయం తెలుసుకున్న చిరాగ్ పల్లి పోలీసులు మృతదేహాన్ని జహీరాబాద్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మాడిగి గ్రామానికి చెందిన శరణప్పగా గుర్తించారు.