పెద్ద కడబూరు :ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మబ్బు ఆంజనేయ అన్నారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పెద్ద కడబూరు బస్ స్టాండులో ధర్నా నిర్వహించారు. అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబడ్డారు. ఉల్లికి రూ.3 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులు, గ్రామములోని రైతులు పాల్గొన్నారు.