పెడనలో ఓటర్ల జాబితాపై కమిషనర్ ఆదేశాలు ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు అందరూ ఒకే బూత్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత BLOలదే అని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. బుధవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో స్తానిక పెడన మున్సిపల్ కార్యలయం లొని తన ఛాంబర్లో పెడనలోని 23వార్డుల BLOలతో సమీక్ష నిర్వహించారు. ఒకే డోర్ నంబర్ ఉన్నవారిని ఒకే కుటుంబంగా పరిగణించాలని, ఒకవేళ వేర్వేరు కుటుంబాలు ఉంటే వాటిని 'బై వన్, టూ' గాగుర్తించాలన్నారు. దీనివల్ల ఓటర్ల జాబితా మరింత కచ్చితంగా ఉంటుందన్నారు.