Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పదవీ బాధ్యత స్వీకరించి, జిల్లా కలెక్టర్ ను కలిసిన బసవ ప్రసాద్

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 1, 2025
భూపాలపల్లి ఇరిగేషన్ డివిజన్-1 డిఈగా విధులు నిర్వహిస్తూ ఇంఛార్జి ఈఈగా కొనసాగుతున్న బసవ ప్రసాద్ కు పదోన్నతి కల్పిస్తూ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పదవి బాధ్యతలు స్వీకరించిన బసవ ప్రసాద్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ను సోమవారం ఐడిఓసి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బసవ ప్రసాద్ కు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియజేసి, భవిష్యత్తు కార్యక్రమాలలో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us