డి.హీరేహాల్ మండలం బాదనహాల్ రైల్వే క్రాసింగ్ స్టేషన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన కాదలూరు గ్రామ రైతులకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చేతుల మీదుగా నష్ట పరిహారం అందజేశారు. గురువారం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆర్దీవో వసంతబాబు, తహసీల్దార్ శ్రీనివాసుల సమక్షంలో 13 మందికి రూ.29.96 లక్షలు అందచేశారు. టిడిపి నాయకులు కాదలూరు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.