జిల్లాలోని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే పోస్టుమెట్రిక్, ఆశ్రమ హాస్టళ్లలో పనిచేసే కార్మికులు శుక్రవారం మధ్యాహ్నం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆద్వర్యంలో నిరవధిక సమ్మెలోకి దిగారు. ఈ సందర్భంగా citu జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమ చారి మాట్లాడుతూ..పోస్టుమెట్రిక్,ఆశ్రమ హాస్టళ్లలో పని చేస్తున్న కార్మికులకు 10 నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి తమ సమస్య చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక సమ్మెకు దిగారు.