కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని పెండ్లిమర్రి మండలం యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ)కు చెందిన కెమిస్ట్రీ ఆచార్యులు , బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ విభాగంలో ప్రొఫెసర్ కె. రియాజున్నిసా,కేఎస్వీ కృష్ణరావుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కు ఎంపికయ్యారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డులలో వీరిరువురికీ చోటుదక్కింది.ఈ విశిష్ట పురస్కారం అందుకున్నందుకు గాను ఆచార్య కృష్ణ రావును, ప్రొఫెసర్ రియాజున్నిసా ను వైస్-ఛాన్సలర్ ప్రొ. అల్లం శ్రీనివాస రావు , రిజిస్ట్రార్ డా॥ పి పద్మ, తదితరులు అభినందించారు.