ప్రకాశం జిల్లా కొండపిలోని కామేపల్లి సెంటర్ లో మంగళవారం పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు గంటకు పైగా నిలిచిపోయింది. కొండపి నుంచి ఒంగోలుకు వెళ్లే పల్లె వెలుగు బస్సు నడిరోడ్డుపై సాంకేతిక లోపం తలెత్తడం వల్ల నిలిచిపోవడంతో పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు పడ్డారు. జెసిబి ని తీసుకువచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న పల్లెవెలుగు బస్సును తొలగించారు. స్టీరింగ్ పటేయడం వల్లే బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిందని డ్రైవర్ తెలిపాడు.