జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించడం జరుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లోఅదనపు కలెక్టర్ పింకేష్ కుమార్,జడ్పీ సీఈఓ మాధురి షా తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటరు జాబితా,పోలింగ్ కేంద్రాల జాబితా ను ప్రచురించడం జరిగిందని అన్నారు.