నల్లగొండ జిల్లాలోని పెద్దవూరలో విషాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం తెలిసిన వివరాల ప్రకారం శాంతి నికేతన్ స్కూలుకు చెందిన బస్సు ఢీకొనడంతో అదే పాఠశాల విద్యార్థి ఎల్కేజీ చదువుతున్న గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విచారణకు ఆదేశించారు .డిఈఓ బిక్షపతి దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు ..న్యాయం చేయాలని, కోరుతూ మృతుడు కుటుంబ సభ్యులు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.. శాంతినికేతన్ పాఠశాలను మూసివేయాలని డిమాండ్ చేశారు.