నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్య నాయకులకు సూచించారు.