శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం, మునుగవలస గ్రామానికి చెందిన మునుగవలస ధనలక్ష్మి కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ రేషన్ షాప్ ను తొలగించిన నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురై రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ప్రస్తుతం ఆమె RIMS హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స పొందుతూ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉన్నారు.ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆమెను పరామర్శించారు. విషయంలో జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి భాధితురాలుకు రేషన్ డిపోను తిరిగి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్న చింతాడ రవికుమార్