గోదావరి వరదల నేపథ్యంలో కె.గంగవరం మండలం, కోటిపల్లి లంక ప్రాంతంలో భారీగా వరద నీరు చేరడంతో పాడి రైతులు పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద కారణంగా పశుగ్రాసం దొరక్క పోవడంతో పశువులకు మేత లేక అల్లాడుతున్నాయి. వరద ఉధృతి తగ్గినా రైతులకు తిప్పలు తప్పడం లేదు. దీనిపై పాడి రైతులు మాట్లాడుతూ పశువులకు ఎండి గడ్డితో పాటు, దాణా ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.