లక్ష్మణచాంద మండలం మునిపెల్లి గ్రామంలో గోదావరి నది మధ్యలో (కుర్రు) చిక్కుకున్న పశువుల కాపరిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. బాణావత్ శంకర్ నాయక్ అనే వ్యక్తి పశువులు మేపడానికి వెళ్లి గోదావరి అటు వైపు వెళ్ళాడు. ఎస్సారెస్పీ నుండి నీటిని విడుదల చేయడంతో ప్రవాహం ఎక్కువ కావడంతో అక్కడే చిక్కుకున్నాడు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ రిస్క్యూ సిబ్బంది గోదావరి నదిలోకి వెళ్లి శంకర్ నాయక్ ను మాచపూర్ గ్రామ ఒడ్డుకు సురక్షితంగా తీసుకువచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.