రాజపూర్ మండల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఇరువైపులా పండ్ల విక్రయాలు కొనసాగిస్తున్నారు చిరు వ్యాపారులు. రహదారి సమీపంలో వాహనాలు నిలపడంతో అటు హైదరాబాద్ ఇటు బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలపడంతో ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.