ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని మండలమిట్ట సెంటర్లో ఉన్న పలు ఎరువుల దుకాణాలను మంగళవారం వన్ టౌన్ సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో భాగంగా రైతులకు ఎరువులను ఎమ్మార్పీ ధరలకు ఇస్తున్నారా ఇవ్వటం లేదా మరియు ఎరువుల నిల్వలకు వివో ఎస్ యంత్రాలలో నమోదు చేసిన నిలవలకు ఉన్న తేడాలను గుర్తించారు ఈ సందర్భంగా దుకాణ యజమానులతో సీఐ మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం నిత్యం కష్టపడుతుందని రైతులుగా అందాల్సినటువంటి ఎరువలను ఎమ్మార్పీ ధరలకు అందించాలని ఆదేశించారు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎరువులను బ్లాక్ మార్కెట్ చేయరాదన్నారు