నారీ ఆరోగ్యంకై మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తమ వంతు కృషి చేస్తున్నామని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి అన్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంబా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు ల ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలొ శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నారీ మహిళా ఆరోగ్య సంకల్పం ప్రియదర్శిని ఉడాన్ ( సానిటరీ న్యాప్ కిన్ ) కార్యక్రమం లొ భాగంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి ఆధ్వర్యంలో న్యాప్ కిన్స్ పంపిణి చేశారు.