నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో ఆదివారం ఉదయం జరిగిన విద్యుత్ ప్రమాదంలో మరియమ్మ అనే మహిళకు చెందిన గుడిసె పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఇటువంటి ప్రాణం నష్టం చోటు చేసుకోలేదు. గుడిసెలోని ఇంటి, వంట సామాన్లతో పాటు బీరువాలోని రెండున్నర తులాల బంగారు రూ.50 వేల నగదు కూడా పూర్తిగా కాలి పోయాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను వెంటనే ఆదుకొని ఆర్థిక సాయం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.