దసరా పండుగను పునస్కరించుకొని ఆర్టీసీ బస్సులలో ప్రయాణించిన ప్రయాణికులకు నగదు బహుమతులను అందించనున్నట్లు జహీరాబాద్ డిపో మేనేజర్ టి స్వామి గారు గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటన లో పేర్కొన్నారు .ఈనెల 27 నుండి అక్టోబర్ 6 వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులలో ప్రయాణించిన వారు టికెట్ పై తమ పేరు, ఫోన్ నెంబర్ ,చిరునామ రాసి బస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన డ్రా బాక్స్ లో వేయాలని సూచించారు.అక్టోబర్ 8న ఆర్టీసీ రీజినల్ ప్రాంతీయ కార్యాలయంలో లక్కీ డ్రా తీయనున్నట్లు పేర్కొన్నారు .ప్రథమ విజేతకు రూపాయలు 25 వేలు ద్వితీయ విజేతకు 15 వేలు తృతీయ విజేతకు 10 వేలు నగదు బహుమతిగా అందిస్తామన్నారు