ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో జరిగిన దారుణ ఘటనపై పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామని శుక్రవారం తెలిపారు. కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన బ్రహ్మయ్య బుధవారం రాత్రి సమయంలో మద్యం సేవించేందుకు స్నేహితులతో కలిసి బయటికి వెళ్లాడు. గురువారం ఉదయం గ్రామ సమీపంలోని నిర్మానుస్య ప్రదేశంలో శవమై కనిపించాడు. పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జున తెలిపారు. అనుమానిత నలుగురు వ్యక్తులను ప్రశ్నించామని విచారణ అనంతరం మీడియా ముందు పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.