మహిళల భద్రత తమ బాధ్యత అని నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాం అన్నారు. గురువారం నంద్యాల ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంతో పాటు వివిధ ప్రదేశాల్లో శక్తి వాట్సప్ నెంబర్లతో కూడిన స్టిక్కర్లను అతికించే కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థినులు ఏదైనా ఆపద సమయంలో ఉంటే వెంటనే ఒక్క ఫోన్ కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పలు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు చట్టాలపై అవగాహన కల్పించారు.