అల్లూరి ఏజెన్సీలో పండించే సీతాఫలాలకు సరైన గిట్టుబాటు ధరలు పలకడం లేదు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పాడేరు మండలం వంటల మామిడి వద్ద వారపు సంతకు భారీ స్థాయిలో సీతాఫలాలు చేరుకున్నాయి. మారుమూల గిరిజన గ్రామాల్లో పండించిన సీతాఫలాలు అతి కష్టం మీద మండలంలో వంట్ల మామిడి వారపు సంతకు స్థానిక గిరి రైతులు తీసుకొచ్చి అమ్ముతుంటారు, రుచితో పాటు నాణ్యత ఎక్కువగా ఉండటంతో ఈ సీతాఫలాలు కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు మైదాన ప్రాంతాల నుండి దళారులు భారీగా చేరుకుంటున్నారు. అయితే గిరిజనులు పడుతున్న కష్టానికి తగిన ఫలం దొరకడం లేదంటూ స్థానిక జరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.