తిరుపతి జిల్లా గుడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం బల్లవోలుకు చెందిన జనని నీట్-2025లో సత్తాచాటింది. 3,200వ ర్యాంక్ రావడంతో ఆమెకు నెల్లూరు AC సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. విషయం తెలుసుకున్న గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆమెను తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. భవిష్యత్తు లో ఉన్నత స్థాయి కి ఎదగాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు