ఈనెల 10న అనంతపురంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమం జరగనుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో చర్చించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్దఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.