ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వాల ప్రోత్సాహం చాలా అవసరం అని ఉప కులపతి పదవి ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉందని, అది అలంకారప్రాయం కాదు తాను తీసుకువచ్చిన ఆర్థిక స్థిరత్వం ఫలితాలు నేడు కనిపిస్తున్నాయని తన హయాంలో పెన్షన్ నిధి రూ 10 కోట్ల నుండి రూ 50 కోట్లకు పెరిగిందని ప్రొఫెసర్ డి. రామకోటయ్య వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం నాగర్జున యూనివర్సిటీలో స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ డి. రామకోటయ్య మాట్లాడారు.