భారతీయ జనతా పార్టీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో,పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి కొత్త బస్టాండ్ వద్ద ప్రజలకు స్వదేశీ వస్తువులవాడకంపైఅవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగాకంపాటి భగత్ రెడ్డి మాట్లాడుతూ,ప్రపంచవ్యాప్తంగావస్తున్న మార్పుల దృష్ట్యా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆత్మ నిర్భర్ భారత్ అత్యంత అవసరం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, “స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి, విదేశీ వస్తువులను బహిష్కరించాలి”అని పిలుపునిచ్చారు.స్వదేశీ ఉద్యమం కేవలం చరిత్రలోని ఘట్టం కాదని అన్నారు.