హైదరాబాద్ జిల్లా: ముఖ్యమంత్రి విద్యా శాఖను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం రవీంద్ర భారతి లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 22 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే శాఖ ఉన్న సమస్యలు పరిష్కారం కాలేదు అన్నారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల సమస్యల పరిష్కారాని ఒత్తిడి తెస్తామని తెలిపారు. మరో మూడు ఏళ్లలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు.