రెయిన్ బజాజ్ డివిజన్ పరిధిలో యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ సోమవారం మధ్యాహ్నం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించి కొత్తగా నిర్మించిన సిసి పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు డ్రైనేజీ సమస్య ఉందని తెలుపగా అధికారులు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.