కౌతాళం :మండలం ఉరుకుంద గ్రామంలో బుధవారం విద్యుదాఘాతానికి గురై రెండు ఎద్దులు మృతి చెందాయి. వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన రైతు ఆంజనేయ ఎద్దుల బండి తో ఐరన్ డబ్బాను తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలాయి. రూ.2 లక్షల విలువైన ఎద్దులు మృతి చెందాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపించారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.