కడప జిల్లా కమలాపురంలో సోమవారం యూరియా కొరత తీర్చాలని సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ శివరాం రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలని, ఎరువుల కేటాయింపులో రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అధిక ధరలకు విక్రయించే డీలర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపారు.రాష్ట్రంలో యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతేడాది ఇదే సీజన్లో ఎటువంటి యూరియా కొరత సమస్య రాలేదన్నారు. ఈ సంవత్సరం మాత్రమే యూరియా సమస్య తీవ్రంగా ఉందన్నారు.